ఎక్కువ చేసే.. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, యంగ్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఎంత డివైడ్ టాక్ వచ్చిన..పాన్ ఇండియా ప్రేక్షకులు దేవరకు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరధం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకొనిపోతుంది. ఒక్క అమెరికాలోనే రాజమౌళి సినిమాలకు పోటీగా రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ దసరా సెలవులలో సరియిన సినిమా లేకపోవడం తో దేవర.. కలెక్షన్స్ ప్రభంజనానికి ఎదురులేకుండా పోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత 16 రోజులకు 8 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ 6న్నర కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తుంది. ఇక భీమవరంలో 17 రోజులకు నేటి ఆదివారంతో కలపి టౌన్ మొత్తంపై సుమారు 1కోటి 40 లక్షల రూపాయల కలెక్షన్ దిశగా దేవర’ అడుగులు వేస్తున్నాడు. 11తెరలపై రిలీజ్ అయిన దేవర’ ప్రస్తుతం 2 థియేటర్స్ ప్రదర్శిస్తున్నారు. తెలుగు సినిమా సత్తా దేవర మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు..