తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

భీమవరం కోవిడ్ వైద్య అధికారులుఫై MLA గ్రంధి ఆగ్రహం..

Updated: April 29, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  కరోనా కట్టడి చర్యలలో భాగంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్  నేడు, గురువారం తన క్యాంపు కార్యాలయంలో వైద్య అధికారులతో సమీక్ష లో మాట్లాడుతూ.. మన భీమవరం లో ప్రభుత్వ వైద్యులు , మెడికల్ సిబ్బంది కోవిడ్ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి పై కూడా ప్రజలు పిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుంటే వారిని వైద్యులు, మెడికల్ సిబ్బంది పట్టించుకోకుండా ఏలూరు వెళ్లిపోవాలని ఎలా రిఫర్ చేస్తారని ఆయనను  ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్స్  ఖాళీ ఉన్నాయో లేదో? తెలుసుకుని, ఆ తర్వాత మాత్రమే ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయాలని ఆదేశించారు. కరోనా రోగులకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గుతున్న సమయంలో కచ్చితంగా రెమ్ డిసీవర్ ఇంజక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తోందన్నారు .అయితే ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని , ముందుగా తగిన పరీక్షలు జరపాలని ,ఈ విషయాన్ని రోగులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వైద్య అధికారులకు సూచనలు చేసారు. 
 
 
 

Related Stories