తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

ఎగ్జిట్‌ పోల్స్‌..తిరుపతిలో వైసిపి కి భారీ మెజారిటీ

Updated: April 29, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:ఎనిమిది దశల పాటు కొనసాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. మార్చి 27న ప్రారంభమైన ఈ పోలింగ్, ఏప్రిల్ 29న జరిగిన చివరి దశ పోలింగ్‌తో ముగిసింది. మే 2న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా ఎగ్టిట్ పోల్ ఫలితాలు వైఎస్సార్‌ సీపీకి - 65.85%, తెలుగుదేశం పార్టీ - 23.1%, బీజేపీ - 7.34% ఓట్లు సాధిస్తుందని తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్టిట్ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌ సీపీ - 59.25%, టీడీపీ - 31.25%, బీజేపీ - 7.5%  ఓట్లు సాధిస్తుందని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా లక్షాలాది ఓట్ల మెజారిటీతో  ఘన విజయం సాధించనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

 

 

 
 

Related Stories