తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

APఇంటర్ పరీక్షలు మే, ఐదు నుంచి,, హల్ టికెట్స్ సిద్ధం

Updated: April 29, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మే నెల ఐదు నుంచి 23 వ తేదీవరకు  జరుగుతాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటించారు. నేటి గురువారం సాయంత్రం నుండి విద్యార్థుల హల్ టికెట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు.  విద్యార్దుల భవిష్యత్తు పాడుకాకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయలేదని, కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయన్నారు.కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని అనవసర రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ద్వజమెత్తారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి చేసిన అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. 
 
 
 

Related Stories