తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

దేశంలో రోజుకు 4 లక్షల చేరువగా కరోనా కేసులు

Updated: April 29, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశంలో కరోనా వైరస్‌ కేసుల ఉదృతి  రోజురోజుకు ప్రచండంగా పెరుగుతుంది.దేశంలో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నేడు, గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. గత బుధవారం ఒక్కరోజే వైరస్‌ బాధితుల్లో 3,645 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది.దేశంలో ప్రస్తుతం 30,84,814 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ అందించారు.
 
 
 

Related Stories