తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది

Updated: May 9, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గతంలో స్కైలాబ్  ప్రమాదం తరహాలో ఇటీవల ప్రపంచాన్ని వణికించిన చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5-బీ రాకెట్‌ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా? అని టెన్షన్‌ పెట్టిన చైనా రాకెట్‌ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి  రాగానే రాకెట్‌ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి.అవి ఇండియాకు సమీపంలోని  పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్‌ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్‌ 29న  చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ అనే భారీ రాకెట్‌ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్‌ పడిన సంగతి తెలిసిందే

 
 

Related Stories