తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు

Updated: April 15, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశ వ్యాప్తంగా కరోనా  సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతుండటంతో ఆ ప్రభావం భీమవరం పరిసర ప్రాంతాలలో విస్తారంగా పండుతున్న చేపల మార్కెట్ ఫై మరోసారి తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇటీవల  చేప మార్కెట్ ధర  కూడా పడిపోతూ వస్తుంది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల హెక్టార్లలో రైతులు చేపల సాగు చేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.20 లక్షల హెక్టార్లలో రైతులు చేపలు సాగు చేస్తుండగా అందులో సింహభాగం భీమవరం జోన్ నుండి  ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, బిహార్,రాష్ట్రాలకు రోజు ఎగుమతులు జరుగుతాయి. 15 రోజుల క్రితం వరకు శీలావతి, కట్ల, బొచ్చె వంటి రకాల చేపలను కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.ప్రస్తుతం కిలో రూ.90కి పడిపోయింది. పెట్టుబడులు, లీజు, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో చేపల ధర తగ్గడం రైతులను నష్టాలకు గురి చేస్తోంది. మరోవైపు గోదావరిలో నీరు తక్కువగా ఉండటం, రేపటితో కాలువలకు నీరు కట్టేస్తుండటంతో చేపల చెరువులకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో పండిన పంటను అయిన కాడికి అమ్మవలసి వస్తుందని  ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల శాఖ, మత్యశాఖ అధికారాలు దీనిపై ద్రుష్టి పెట్టాలి.. 

 
 

Related Stories