తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం

Updated: April 13, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఆహ్లాదంగా ప్రయాణిస్తూ ..పాపికొండల  ప్రక్రుతి అందాలు చూస్తూ  చల్లని గాలులలకు సేద తీరుతూ అందమైన బోట్లలో  ప్రయాణించే రోజులు మళ్లీ వచ్చేశాయి. అందమైన పాపికొండల పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ ఏప్రిల్ 15వ తేదీ నుండి అనుమతించింది. గత ఏడాదిన్నర కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో దాదాపు 50 మంది జలసమాధి అయిన ఘోర ప్రమాదం అనంతరం  గోదావరిలో అన్ని మోటార్‌ బోట్లనూ పర్యాటకాన్ని  నిషేధించింది. గతంలో గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు నడిచేవి. అలాగే భద్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు రాకపోకలు సాగించేవి. తిరిగి మరల ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యాన హరిత ఏసీ లగ్జరీ బోటుకు మాత్రం పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. ఈ బోటుతోనే పాపికొండల పర్యాటకం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. దీనితో  పర్యాటకులు, ఇటు ఈ పర్యాటకంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తమ జీవనోపాధి తిరిగి లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 
 

Related Stories