తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

గోదావరి జిల్లాలో కాలువలు15 నుండి మూసివేస్తారు.

Updated: April 15, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్:  ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రక్క ఎండలు మండిపోతున్నాయి. మరో ప్రక్క ఈ  ఏప్రిల్ 15వ తేదినుండి ఉభయ గోదావరి డెల్టాలకు గోదావరి నీటి సరఫరా నిలిపి వేయనున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌ 10 నుంచే కాలువలను మూసివేస్తామని నీటి పారుదల శాఖ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ అధికారులు ప్రక టించారు. ప్రస్తుత వేసవిలో సుదీర్ఘ కాలం నీటి సరఫ రాను అంటే 75రోజులు పాటు నిలిపివేస్తారు.దీనితో మరో ఐదు రోజుల వరకు కాలువలను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల నిర్వహణ కోసం ఎగువ భాగంలో గోదావరికి ఏప్రిల్‌ 15న అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. ఉభయ గోదావరి డెల్టాలకు రోజూ 4,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు, అందులో పశ్చిమ డెల్టాకు 2,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గ్రామాల్లో మంచి నీటి చెరువులను నింపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతంలో ఆక్వా చెరువుల్లో నింపేందుకు రైతులు నిమగ్నమ య్యారు. వేసవి విరామంలో కాలువలకు ఓఅండ్‌ ఎం నిధులతో మరమ్మతులు చేపట్టాలని సాగునీటి శా ఖ అధికారులు ప్రణాళిక చేశారు. పశ్చిమ డెల్టా పరి ధిలో రూ.10 కోట్ల నిధులతో తో ఇరిగేషన్ పనులు చేపట్టనున్నారు. 

 
 

Related Stories