తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

అగ్ర హీరోల సినిమాల డైరెక్టర్స్ మారిపోయారు.

Updated: April 15, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల అగ్ర హీరోల కొత్త సినిమాల కాంబినేషన్స్ లో ఊహించని మార్పులు వచ్చాయి. అనుకున్నవి ఒకటనుంకొంటే తీరా సినిమా ప్రారంభం నాటికీ  హీరోల డైరెక్టర్స్ మారిపోతున్నారు. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా చేయనున్న సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే ప్రచారం కూడా సాగింది. కానీ తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ‘జనతా గ్యారేజ్‌’(2016) తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, కొరటాల శివ మళ్లీ కలిసింది.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, ‘ఆచార్య’ తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారట. అయితే మరి.అల్లుఅర్జున్‌–కొరటాల శివ కాంబినేషన్‌లోని సినిమా వాయిదా పడినట్లే.. అలాగే  త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ‌ సినిమా ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలో త్రివిక్రమ్, మహేశ్‌బాబు సినిమా పట్టాలెక్కుతోంది. 
 
 
 

Related Stories