తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

స్టాక్‌మార్కెట్‌ ఆరంభంలోనే భారీ పతనం..కరోనా దెబ్బ

Updated: April 12, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: అంతర్జాతీయంగాను ,భారత దేశవ్యాప్తంగాను  విస్తరిస్తున్న కరోనా వైరస్‌, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌,నేడు, సోమవారం ఉదయం ఆరంభంలోనే  భారీ పతనాన్ని నమోదు చేసింది.  సెన్సెక్స్‌ 916, నిఫ్టీ 276 పాయింట్ల మేర  నష్టపోయాయి. అనంతరం మరింత క్షీణించిన  సెన్సెక్స్‌ 1160 పాయింట్ల నష్టంతో 48430 వద్ద, నిఫ్టీ 354  పాయింట్లు పతనమై 14482 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని రంగాల షేర్లు  అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్‌ 1353పాయింట్ల నష్టంతో 484237వద్ద, నిఫ్టీ  411 పాయింట్లు పతనమై 14423 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 48300, నిఫ్టీ 14500 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలనందించాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. 

 
 

Related Stories