తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

ఉండి ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..జిల్లాలో32 కేసులు

Updated: April 11, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:   తాజగా ఉండి ఎమ్మె ల్యే మంతెన రామరాజుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు  భీమవరంలోని ఉండి ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన ఆయనకు నాలుగు రోజులుగా ఆరోగ్యంలో తేడా రావడంతో టెస్ట్‌లు చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లి ఏఐజీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎవరూ అందోళన చెందవద్దని కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు.పశ్చిమ గోదావరి జిల్లాలో గడచినా 24 గంటలలో   32 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఏలూరులో ఆరు, చింతలపూడి, కొవ్వూరులలో మూడేసి చొప్పు న, గణపవరం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లిలలో రెండేసి చొప్పున నమోదుకాగా మిగతా కేసులు భీమవరం, బుట్టాయి గూడెం, కాళ్ళ, పెదపాడు, పెనుగొండ, పెదవేగి, టి.నర్సాపురం, ఉండ్రాజవరంలలో ఒకొక్క కేసు చప్పున  నమోదు అయ్యాయి. 

 
 

Related Stories