తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

ఏపీలో బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే పని..

Updated: April 27, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కరోనా నేపథ్యంలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి శుక్రవారం నుండి బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకింగ్‌ వేళలు తగ్గించాలన్న ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సూచనల మేరకు రాష్ట్రంలో బ్యాంకింగ్‌ వేళలను తగ్గిస్తూ ఎస్‌ఎల్‌బీసీ  ఆదేశాలు జారీచేసింది. బ్యాంకులు శుక్రవారం నుంచి (నేటినుంచి) మే 15వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు మాత్రమే పనిచేస్తాయని తెలిపింది.బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్‌లు, ప్రభుత్వ లావాదేవీలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇతర సేవలను ప్రాధాన్యత, అవసరాన్ని బట్టి మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది.పెన్షన్, డీబీటీ వంటి చెల్లింపులకు, ఏటీఎంలు, వాటికి సంబంధించిన ఇతర సేవలు సాధారణంగానే కొనసాగుతాయి.

 

 
 

Related Stories