తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA

Updated: April 14, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం లో నేడు, బుధవారం ఉదయం  ఈ నెల 14 నుండి 20వ తారీకు వరకు నిర్వహించనున్ " భారత అగ్నిమాపక వారోత్సవాలను" ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ స్థానిక  ఫైర్ స్టేషన్ వద్ద ముందుగా,  డా అంబెడ్కర్ చిత్రపటానికి 130 జయంతి సందర్భముగా ఘన  నివాళ్లు అర్పించి,  తదుపరి  ప్రారంభించారు. దీనిలో భాగంగా అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ ప్లే కార్డ్ లను, మరియు జెండా ఊపి అగ్ని ప్రమాదం జరిగే ప్రాంతాలను వేగంగా గుర్తించేందుకు, పిర్యాదులు స్వీకరించేందుకు ఫైర్ అధికారి కోసం  ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటారు బైకు ను ప్రారంభించారు. ఇక ఈ వేసవిలో ఎండలు మండుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలని కోరారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి చేసే సాహసాలను అభినందిస్తూ వారోత్సవాలు విజయవంతం అవ్వాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యం చెయ్యాలని కోరుతూ  సిబ్బందికి అభినందనలు తెలిపారు. 

 
 

Related Stories