తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు

Updated: May 9, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రపంచ బ్యాంకు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమర్ధత దేశానికీ ఆదర్శంగా ప్రశంసించింది. గతేడాది కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు నిశ్చింతగా ఉండడాన్ని తాము గుర్తించినట్లు ప్రపంచబ్యాంకు పేర్కొంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు... మధ్యవర్తులు లేకుండా నేరుగావారి బ్యాంకు అకౌంట్స్ ద్వారా  అందుతున్న నగదు పేద ప్రజల జీవితాలకు ఎనలేని భరోసాగా మారాయని ప్రశంసించింది.  దేశంలోనే అత్యధికంగా గత జూన్‌లో రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.2,866 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు అందించిందని ప్రపంచ బ్యాంకు సర్వేల్లో వెల్లడైంది మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడలేదని, ఉపాధికి కూడా ఎలాంటి కొరత లేదని సర్వేలో వెల్లడైంది. మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం కుటుంబాలకు నగదు బదిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయం అందించిందని, ఇది ఇతర రాష్ట్రాల కన్నా అత్యధికమని ప్రశంసించింది. 

 
 

Related Stories