తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా

Updated: May 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశంలో భారీగా కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పెద్దలు  బెంగాల్‌ను హస్తగతం చేసుకోవాలన్న యావతో ఈ ఆరునెలల కాలంలో రాష్ట్రానికి రోజూ వచ్చిపడ్డారని, ఆ శ్రద్ధ ఏదో కరోనా కట్టడిపై పెట్టి ఉంటే నేటి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని దుయ్యబట్టారు. శాసనసభ స్పీకర్‌గా టీఎంసీ ఎమ్మెల్యే బిమన్ బందోపాధ్యాయ్ ఎన్నికైన అనంతరం అసెంబ్లీలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మతపరమైన ప్రేరేపణలను సహించేది లేదని తేల్చి చెప్పిన మమత..ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ‘‘నేను చాలెంజ్ చేస్తున్నా. మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల సంఘం వారికి (బీజేపీకి) నేరుగా సాయం చేయకుంటే ఆ పార్టీకి పట్టుమని 30 సీట్లు కూడా వచ్చేవి కావు. అధికారుల కళ్ల ముందే రిగ్గింగ్ జరిగింది’’ అని విమర్శించారు. 

 
 

Related Stories