తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి

Updated: May 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: రాష్ట్రంలో కరోనా కట్టడికై ప్రభుత్వం దేశంలోనే ఇక్కడ  సమర్థవంతమైన చర్యలు చేపడుతోందని మంత్రి కొడాలి నాని మీడియాతో అన్నారు. ఏపీలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకాలు వేశామని, అది మన సత్తా అని, కానీ కరోనా వాక్సిన్ లు కొరత తీవ్రంగా ఉండటంతో మరిన్ని వ్యాక్సిన్లు కావాలని సీఎం  వైఎస్‌ జగన్‌ ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారన్నారు. అయినప్పటికీ,  ప్రక్క రాష్ట్రంలో కూర్చుని చంద్రబాబు, లోకేష్ లు ఇతర పచ్చ బాచ్ మీడియా టీమ్ కలసి ఎవరు ఎక్కడ చనిపోయిన కరోనా తోనే అంటూ..శ్వాసనాలలో లైవ్ కెమెరాలు పెట్టించి మన రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజానికి వీరికి మనస్సుల్లో ప్రజలు ఎక్కువమంది కొరోనాబారిన పడి మరణాలు ఎక్కువ సంభవించాలని అప్పుడు చావులపై రాజకీయ చేసి  ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో సీబీఎన్‌ 420 అనే వైరస్  నారావారిపల్లెలో పుట్టింది. 75 ఏళ్ళు వచ్చిన చంద్రబాబుతన కుటుంబానికి సింగపూర్ నుండి కరోనా డోసులు తెప్పించుకొని ఒక్కరికి 3 డోసులు వేయించుకొన్నారని, మిగతా ఎన్టీఆర్ కుటుంబాన్ని, తన టీడీపీలో మిగతా ముసలోళ్ళు అచ్చన్నను, బుచ్చయ్య , అయ్యన్న ను తెలుగు దేశం కార్యకర్తల కుటుంబాలకు సింగపూర్ వాక్సిన్ వేయించకుండా వదిలేసాడని ఎద్దేవా చేసారు.  ‘రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్దంగా ఉన్నాం.వాక్సిన్ల కోసం రూ.1600 కోట్లను ఎక్కడి పంపించాలో చెప్పండి.. ఇచ్చేందుకు సిద్ధం చంద్రబాబుకు, పచ్చమీడియా కు సవాల్ విసురుతున్నట్లు మంత్రి కోడలి నాని ప్రకటించారు. 

 
 

Related Stories