తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్

Updated: May 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: గత కొన్నిరోజులుగా తెలంగాణ లో సంచలనం రేపిన వామనరావు దంపతులు హత్య కేసులో అనుమానితుడు పరారీ లో ఉన్న  పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ను ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయనను రామగుండం టాస్క్ ఫోర్స్  పకడ్బందీ ప్యూహంతో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రామగుండం తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు మాయం అయ్యారు. ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారని వార్తలు వినిపించగా, తాజాగా భీమవరంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. వారం రోజులుగా అదృశ్యమవడానికి గల కారణాల గురించి మధును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పెద్దపల్లికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు అరెస్టు చెయ్యడం గమనార్హం. 

 
 

Related Stories