తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

సుప్రీంకోర్ట్ చీఫ్ గా తెలుగువాడు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

Updated: April 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భారత దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చీఫ్‌గా మ‌న స్వచ్ఛమైన తెలుగువాడు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణత్వ‌ర‌లో బాధ్య‌త‌లు స్వకరించ‌నున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరుకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయ‌న చీఫ్ జ‌స్టిస్ అభ్య‌ర్థిత్వంపై నెల‌కున్న అనుమానాల‌కు తెర‌ప‌డిన‌ట్టైంది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా నివాసి. ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ బోబ్డే ఈ నెల 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. బోబ్డే త‌ర్వాత సుప్రీంకోర్టులో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సీనియ‌ర్‌.కాబట్టి ఆ పదవి వరించింది. 

 
 

Related Stories