తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

తూగో జిల్లా తీర్పు ఏకపక్షమే..తాజాగా ఏకగ్రీవాలలో కూడా

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్,న్యూస్: పచ్చని కోనసీమ ను మకుటంగా ధరించిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు.. ఏ ఎన్నికలైనా ఇక్కడి ఓటర్ల తీర్పు ఎప్పుడూ ఏకపక్షంగానే  ఉంటుంది. గతంలో టీడీపీ కి కంచుకోట.. ఇప్పుడు వైసిపి కి.. ఇందుకు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైసిపికి  తూర్పు ఓటర్లు పట్టం కట్టారు. తాజాగా పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం సుమారు 90 శాతం ఆ పార్టీ  మద్దతుదారులు గెలిచారు. మరో వారం రోజుల్లో పురపాలక సంఘాల ఎన్నికలు జరగనున్నాయి.ఒక్క తూగో జిల్లాలోనే  రాష్ట్రంలో అత్యధికంగా రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు.. ఉన్నాయి. వీటిలో కాకినాడ నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉంది.  రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగడం లేదు. తుని, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, పెద్దాపురం మున్సిపాలిటీలకు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొత్తం 268 వార్డులుండగా 35 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారంతా వైసిపి అభ్యర్థులు కావడం గమనార్హం..up file photo 

 
 

Related Stories