తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

సీఎం కెసిఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..ఒక స్ఫూర్తి గాధ

Updated: October 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: గతంలో తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న ప్రత్యూష కు రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను విద్యానగర్‌లోని హోటల్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుణు చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గతంలో సొంత తండ్రి, పినతల్లి  దారుణ చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి మీడియాలో చుసిన ఎవ్వరు మరచిపోలేరు. ఆమె దీనస్థితిని చూసి కరిగిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు..ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు చదివిన ప్రత్యూష.. నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఆమె  నిశ్చితార్థం నేపథ్యంలో  సీఎం కేసీఆర్‌ ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలను తెలుసుకున్న సీఎం సంతోషం వ్యక్తం చేశారు.మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్య ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. తన పెళ్లికి కచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని, ఆయన అండతో కోలుకున్నానని ప్రత్యూష తెలిపారు. 

 
 

Related Stories