సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: ఓం.. గం ..గం .. గణపతియే నమః .. తెలుగు రాష్ట్రాలలో చిత్తూరు జిల్లా లో కాణిపాకం, తూర్పు గోదావరి జిల్లాలో అయినవిల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లు తున్నాయి. అయితే తెలంగాణాలో అది రాజధాని నగరంలో రోజు లక్షాది ప్రజలు సంచరించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మహిమానిత శ్రీ గణేష్ దేవాలయం అంటే తెలియనివారు ఎవరు ఉండరు. శతాబ్దం పైగా ప్రజల నమ్మకానికి, ఆయన అనుగ్రహం ఉన్న భక్తులకు విజయాలకు శాంతి సౌభాగ్యాలకు కొదవే లేదని ప్రతీతి.. ఆయన చూపిన నిదర్శనాలు కు కొదవు లేదు. ఆయన దర్శనభాగ్యం కాగానే కోరుకొన్న పనిలో విగ్నాలు తొలగి తప్పుకుండా వెంటనే పురోగతి కనిపిస్తుందని, అక్కడ గొప్ప నిదర్శనం ఉందని లక్షలాది భక్తులు నమ్మకం. దేవాలయ ప్రాంగణం అంత ప్రశాంత వాతావరణంలో శివాలయం, సుబ్రమణ్య ఆలయం, పార్వతి ఆలయం, ఆంజనేయ ఆలయం, పార్వతి ఆలయాలను ఉప ఆలయాలుగా కొలువు దీరి ఉంటుంది. ఇక్కడ ప్రతి రోజు శ్రీ వినాయక కళ్యాణం, శ్రీ సత్యనారాయణ వత్రం చెయ్యడానికి ఆలయ పూజారులతో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కమ్మని ప్రసాదాలు నేతి లడ్డు, వడ్డ భక్తులకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ శ్రీ గణేషుని దర్శన భాగ్యం సర్వ శ్రేయస్సాదాయకం.. ఓం గణేశా..