సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో ( మన సిగ్మా ఛానెల్ ఆఫీస్ వద్ద) సుమారు 150 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన మహిమ కలిగిన ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయం వద్ద దసరా వేడుకలలో భాగంగా వచ్చే శుక్రవారం మహర్నవమి సందర్భముగా జాతర’ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు శతాబ్దం కాలంగా కాలం మారుతున్నా.. ప్రతి ఏడాది ఆచారం ప్రకారం భారీ డప్పు శబ్దాల మధ్య ఇక్కడ నిప్పుల గుండం ఏర్పాటు చేసి భక్తులు త్రొక్కడం పెద్ద హైలైట్.. ఇక్కడ ప్రతి ఏడాది శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి కర్ణి భక్తులు ఆధ్వర్యంలో మహర్నవమి రోజు సంబరం నిర్వహిస్తూనే ఉంటారు. ఉదయం నుండి భక్తుల కోలాహలం ఉంటుంది. రేపు రాత్రి 7గంటల నుండి శ్రీ స్వామివారికి మేళతాళాలతో , మంటలతో శూలాలతో వీర శైవ నృచాలు ,డప్పు వాయిద్యాలతో, బుట్టబొమ్మలా, ప్రభల కోలాహంతో సంబరం నిర్వహిస్తారు. . తమ సమస్యలు, కష్టాలు గట్టెక్కాలని కోరుకొంటూ ఇక్కడ ఉదయం నుండి ఉపవాస నిష్ఠ తో ఉన్న భక్తులు రాత్రి 10 గంటలకు ఏర్పాటు చేసే నిప్పుల గుండంలో భక్తులు ‘అసారభ అసారభ అంటూ నిప్పులను త్రొక్కవచ్చు.. .తదుపరి నంది వాహనం ఎక్కి కాగడాలతో,మేళతాళాలతో ,స్వామివారు నగర సంచారం చేసి తెల్లవారు జామున దేవాలయం కు తిరిగి రావడంతో సంబరం ముగుస్తుంది.