తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

దిశ యాక్ట్ తో.. దేశానికీ దిశ చూపిన సీఎం జగన్

Updated: December 17, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: చాల కాలం నుంచి దేశ వ్యాప్తంగా మరియు మన  తెలుగు రాష్ట్రాలలో కూడా  మహిళలపై వారి వయస్సు తారతమ్యాలు లేకుండా విచ్చలవిడిగా మృగాళ్లు దాడులు, హత్యాచారాలు, దహనాలు చెయ్యడం పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో 'నిర్భయ' దారుణ మానభంగం, హత్యాచారం తరువాత దేశప్రజలు అంత స్థాయిలో కదిలించిన దారుణ  ఘటన తెలంగాణాలో  మహిళా డాక్టర్ దిశ ఫై  నలుగురు మృగాళ్లు జరిపిన దారుణ కాండ. వారు పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించడం, తదనంతర పరిణామాలలో  ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ నేతృత్వం లో  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గతంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా, సంచలన రీతిలో  మహిళపై హత్యాచారం చేస్తే నిందితులపై విచారణ జరిపి, నేరం రుజువు అయితే కేవలం 3 వారాలలో వారికీ మరణ శిక్ష విధించాలని, చిన్నారులపై లైంగిక దాడులకు,వేధింపులకు  15 ఏళ్ల వరకు కఠిన శిక్షలు అమలు చట్టాన్ని తీసుకోని వచ్చి దానికి ' దిశా యాక్ట్' గా నామకరణం చెయ్యడం పట్ల, దేశ వ్యాప్తంగా ప్రతి మానవతా వాది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సీఎం జగన్ చొరవకు దేశం లోని అన్ని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి దిశా ఆక్ట్ ఇప్పుడు దేశానికే 'దిశ' చూపిస్తుంది. ఇదే యాక్ట్ స్పూర్తితో తమ తమ రాష్ట్రాలలో యాక్ట్ లు తీసుకోని రావడానికి ఇప్పటికే ఢిల్లీ, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వాలు  దిశ చట్టం ప్రతులను పంపాలని  తమను కోరినట్లు స్పీకర్‌ తమ్మినేని తాజగా అసెంబ్లీ లో  ప్రకటించారు కూడా. ఆయన దిశ చట్టం ఆమోదించడం  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి గర్వకారణమన్నారు. మరిన్ని రాష్ట్రాలు ' దిశ యాక్ట్ '  ఫై ద్రుష్టి సారించాయి. ఇటువంటి చట్టాన్ని తీసుకుని రావడానికి ఒక సీఎంగ కాకుండా ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆలోచించిన జగన్మోహనరెడ్డి  దేశానికీ ఆదర్శంగా నిలిచారని భావించడంలో  అతిశయోక్తి లేదు. మనిషిని గౌరవించాలి అంతే గానీ మానవత్వం లేని మృగాలకు' దిశ యాక్ట్' చట్టం  అమలుతో  తమకు సమాజంలో బ్రతికే హక్కు ఇంకా కేవలం 21 రోజులే ఉంటుందని మరణశాసనం రాసిపెట్టిన  భయం కొంతయిన పనిచేస్తుంది కదా? ..సిగ్మా ప్రసాద్ కాలమ్స్..  cell: 9989044844 

 

 
 

Related Stories