తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

బాబు సొమ్ము 35 కోట్లు పంచిన పవన్,నాగబాబు..గ్రంధి

Updated: November 6, 2019

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: 4-11-2019, ఎన్నికలు పూర్తయ్యి 5 నెలలు గడుస్తున్నా  తాను భీమవరం లో ధనబలంతో ఓడిపోయానని   పవన్‌ కల్యాణ్‌ తరచూ ప్రకటించడం , ఇటీవల ఆయన అన్నయ్య చిరంజీవి కూడా దానిని సమర్ధిస్తూ ఒక ఇంటర్వ్యూ  లో పేర్కొనడం,పవన్ నిన్న వైసిపి నేతలను విమర్శిస్తూ  విశాఖలో తన నిజాయితీ గురించి పదేపదే చెప్పుకోవడంతో .. ఇప్పటివరకు ఓపిక పట్టిన వైసీపీ నేతలు తాజాగా దానిపై అన్ని చానెల్స్ లో ధ్వజం ఎత్తటం గమనార్హం. తాజాగా భీమవరం లో పవన్ కళ్యాణ్ ఫై అద్భుత విజయం సాధించి అందరిని నివ్వెరపరచిన, వైసిపి ఎం ఎల్ ఏ  గ్రంధి శ్రీనివాస్ నేడు,సోమవారం మీడియాతో మాట్లాడుతూ..  పవన్ లాంగ్ మార్చ్ తో విశాఖ వేదికగా మరో  డ్రామాకు తెరలేపారని, అలాగే.. పవన్‌కల్యాణ్‌ ఎప్పటికి చంద్రబాబుకి దత్తపుత్రుడేనన్నారు. ‘తాను ఏ పార్టీకి దత్తపుత్రుడిని కాదంటూ పవన్‌ ఈ ఏడాది బిగ్‌ జోక్‌ చెప్పారని’ అన్నారు. ‘2019 ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నుండి పవన్‌కు రూ.35 కోట్లు అందాయి. భీమవరం లో  పవన్ కళ్యాణ్ తో పాటు నర్సాపురం పార్లమెంటులో తన సోదరుడు నాగబాబుని గెలిపించేందుకు ఆ డబ్బును పంచారు.డబ్బు పంచిన కూడా  ప్రజలు ఓడించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే, ఆ డబ్బును జనసేన పంచింద’ని, పవన్ గెలుపుకోసమే  చంద్రబాబు ఇక్కడ  ప్రచారంకు కూడా  రాలేదని అందరికి తెలుసునని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ఆరోపించారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నుండి పవన్ ఎంత తీసుకున్నారో అందరికి తెలుసునన్నారు. తన అభిమానులను  జన సైనికులను పవన్ తీవ్రవాదులుగా మార్చి సమాజంపై వదిలేశారని వారి దౌర్జన్యాలు  చూసి జనం భయపడుతున్నారని ..అందుకే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

 
 

Related Stories