తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

ఆంధ్ర ప్రదేశ్ లో చికెన్‌ ధర 300 రూ, దాటిపోయింది.

Updated: April 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తాజగా  చికెన్‌ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.300కు దాటిపోయి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, భీమవరం పరిసరాలలో ఇంకా 270 రూ ..280 రూపాయలు మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు కోళ్లు బరువు పెరగకపోవడం, చనిపోతుండటంతో కూడా  చికెన్‌ అమాంతంగా పెరిపోయిందని పౌల్ట్రీ నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్‌ రేటు అధికంగానే (కిలో రూ.250 వరకు) ఉండేది. కోవిడ్‌ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు  ఒకానొక దశలో 2 కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్‌ ధర పెరగడం మొదలైంది. గత ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర. ఏప్రిల్‌ 2న రూ.270, ఏప్రిల్‌ 3న రూ.296కు పెరిగింది. తాజాగా నిన్న ఆదివారం విజయవాడలో రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. 

 
 

Related Stories