తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారు, భీమవరం

Updated: June 1, 2020

సిగ్మా తెలుగు డాట్ కామ్ న్యూస్.  దేవుళ్ళు పేజీ : ఓం... శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ  వారు : భీమవరం పట్టణ పురాధీశ్వరి 'శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ  వారి  గురించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దయగల చూపులతో,వజ్ర కిరీటధారి అయ్యి, నిలువెత్తు సువర్ణమయమైన ఆభరణాలతో,బంగారు డమరుకం,నాగాభరణం,ఘట్టాలతో పాటుగా,వజ్రఖచితరత్నాలు పొదిగిన సువర్ణ త్రిశులధారియై, తన్ను దర్శించే భక్తులకు, విరాట్ స్వరూపంతో మంత్రముగ్దులను చేయటమే కాదు,వారి కష్టాలను తీర్చి, సుఖసంతోషాలను అనుగ్రహిస్తూ,తన అభయహస్తంతో అనుగ్రహిస్తారు. అందుకే భక్తులు, ప్రశాంతతో కూడిన అమ్మవారి మోముని, మరల మరల దర్శించుకుంటూ ఉంటారు.
                    
అమ్మవారి స్థలపురాణాన్ని,చరిత్రను పరిశీలిస్తుంటే, క్రీస్తు పూర్వం 1200 నుండి అమ్మవారు భీకర రూపంలో ఇక్కడ వెలసినట్లు పెద్దలు చెబుతారు. చాలాకాలం క్రితం వరకు ఈ ప్రాంతం అంతా మామిడి తోట ఉండేదని, అందుకే ఆమెను 'మామిడిఅమ్మగా పిలిచేవారని, కాలక్రమేణా 'మావుళ్ళమ్మ'  గా పేరు స్థిరపడింది  చరిత్రకారుల విశ్వాసం. పూర్వం జంతు బలులు ఎక్కువగా ఇచ్చేవారని చెబుతారు. అయితే 1958 సంవత్సరంలో గ్రంధి అప్పారావు అనే రూపశిలిపి, చిత్రకారుడు అమ్మవారి నయనాలను, కరుణ, శాంతం కలిగిన మాతృమూర్తిగా మార్చారు. తదుపరి గర్భలాయం కు ఇరువైపులా గోడలపై శాంతమూర్తులైన బుధుడు,రామకృష్ణ పరమహంసల చిత్రాలు చెక్కరు. ఆలయ( ఆధునీకరణ లో భాగంగా ప్రస్తుతం అవి లేవు) రాను రాను అమ్మవారి ప్రభ వెలిగిపోతుంది. అలాగే భీమవరం పట్టణం ఆర్థిక ప్రాభవం కూడా పెరిగిపోసాగింది. ఈ సమయంలో అమ్మవారికి 60 కేజీల బంగారం తో చీర పెట్టాలని దాతలు ప్రతిపాదించి, దానికోసం కమిటీ  ఏర్పాటు చేసిన,ఇంకా అమ్మ అనుగ్రహము కోసం వేచి చుస్తునారు. బంగారు  మనస్సు ఉన్న తల్లికి భక్తులు ఏమిచ్చినా 'ఆమే కృప ముందు ఒక నూలుపోగు మాత్రమే కదా!' అమ్మవారి ఆలయం లో ప్రతి రోజు దూర ప్రాంతాల భక్తులకోసం అన్నసమారాధన జరుగుతుంది.
             
 శ్రీశ్రీశ్రీ మావులమ్మవారి వార్షిక ఉత్సవాలు ను గత 56 సంవత్సరాలుగా స్థానిక 'నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘము' వారి ఆధ్వర్యంలో ప్రపంచం లోనే మరిఎక్కడ జరగని విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాలలో ప్రారంభించబడి, నెలరోజుల పైగా ఎంతో ఘనంగా భారీ సెట్టింగులతో,విద్జుట్ దీప అలంకరణలతో,తాటాకు చలువ పందిళ్ళతో, నాటక,హరికథ,బుర్రకథ,శాస్త్రీయ,సినీ పాటల  కళాకారుల కార్యక్రమాలతో,మన   సంస్క్రతి,సంప్రదాయాలను పరిరక్షించే దిశగా, స్వర్గం దిగి వచ్చిందా? అన్నాట్లు గా నిర్వహిస్తారు. ఆఖరి రోజు లక్ష మంది భక్తులకు పంచభక్ష పరమాన్నాలతో నిర్వహించే అన్నసమారాధన కార్యక్రమం లో పాల్గొని తీరవలసిందే. ఈ ఉత్సవాల సందర్భముగా ఎంతో దూరప్రాంతాలనుంచి, విదేశాలనుంచి కూడా భక్తులు  వస్తు, అమ్మవారి అస్సిసులుతో పాటుగా ఆనందానుభూతి ని, ఆధ్యాత్మిక శోభను సొంతం చేసుకొంటారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర  దేవాదాయ శాఖ సహకారం కూడా ఉంటుంది. ఉత్సవాల చివరి 10 రోజులు అమ్మవారు వివిధ దేవి అవతారాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు, అలాగే ప్రతి  దసరా పర్వదినాలలో అమ్మవారు విభిన్న శక్తిమాత అవతారాలలో దర్శనమివ్వడం, దసరా వేడుకలు జరుపుకోవడం, జేష్ఠ మాసంలో ఘటాల రూపంలో పట్నంలో ఇంటింటికి  వెళ్లి పసుపు నీళ్లతో అభిషేకించుకోవడం, ప్రజలను దుష్ట శక్తుల బారి నుండి రక్షించడం కోసం సంచారం చేయడం, జేష్ఠమాస జాతరను ఘనంగా జరుపుకోవడం,ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇన్ని మహిమలున్న తల్లి భక్తుల పాలిట కొంగు బంగారం.                                                                  శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలను 1995లో తొలిసారి  లైవ్లో మా సిగ్మా ఛానల్  ద్వారా ఇంటింటికి ప్రసారాలు అందించే అవకాశం మాకు కల్పించినందుకు అమ్మకు ధన్యవాదములుతో... అందరిని అనుగ్రహించాలని కోరుతూ..  ప్రణమిళుతూ.. సిగ్మా ప్రసాద్.     wwwsigmatelugu.com 

 
 

Related Stories