తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరం పాతబస్టాండ్ పునఃప్రారంభించిన MLA గ్రంధి..

Updated: September 11, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం 2 టౌన్ లో పాత ఆర్ టి సి  బస్టాండ్ ను  10 ఏళ్ళు తరువాత తిరిగి  నేడు, 9-9-2019 శనివారం అధికారికంగా  స్థానిక ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన బస్టాండ్ ఆఫీస్ ను తిరిగి ప్రారంభించారు. అలాగే ఇక్కడ ఆగి వెళుతున్న జంగారెడ్డి గూడెం బస్సు  కు పచ్చజెండా ఊపి బస్ సేవలు ప్రారంభించారు. ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ మీడియాతో, అక్కడ చేరిన ఆర్ టి సి అధికారులు, ప్రాంత ప్రజలు , వైసిపి నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ రోజు  భీమవరం టూ టౌన్ ప్రజలకు మంచి రోజని,  గతంలో తన హయాంలో ప్రయాణికులుతో, నూతన రోడ్డు వసతులతో కళకళలాడిన పాత బస్టాండ్  గత 10 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ నేతల ఆక్రమణకు గురి అయ్యి ఇక్కడ వారి ప్రవేటు వాహనాలు తప్ప సామాన్యులకు ఆర్ టిసి  బస్సు సౌకర్యం అందుబాటులో  లేకుండా పోవడమే కాకుండా, టీడీపీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోడవముతో, అడిగేవాడు లేనట్లు ఇక్కడ వ్యవహారాలు జరిగాయని, వాటి అన్నిటికి  ఇక అడ్డుకట్ట వేశానని,అధికారులు సహకరించారనిటీపీ గూడెం మరియు  కొన్ని ప్రాంతాలకు వెళ్లే ఎక్సప్రెస్  బస్సులు తప్ప అన్ని బస్సులు ఇక్కడ ఆగేటట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిపై తనకు ప్రజలు హర్షం తెలుపుతున్నారని, ఇకమీదట టూ టౌన్ ప్రజలు, భీమవరం మండల ప్రజలు  ఇక పాత బస్టాండ్ వచ్చి బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.  ఆర్ టి సి నేతలతో పాటు, మునిసిపల్ కమిషనర్ ఎన్ అమరయ్య  కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 
 

Related Stories