తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరంలో దోపిడీ దుమ్ము దులుపుతున్న MLA గ్రంధి

Updated: September 7, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 5-9-2019..  భీమవరం చేపల మార్కెట్, పాత బస్టాండ్‌లను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రెస్ట్ హౌస్ రోడ్ చివరలో ఉన్న  ఇరిగేషన్ సైట్లో ఉన్న గంగాలమ్మ చేపల మార్కెట్ వ్యాపారుల వద్ద టీడీపీ నేతలు గత ఎం ఎల్ ఏ అంజిబాబు హయం ముగిసిన తరువాత కూడా  అన్యాయంగా ఆసీలు పన్నులు వసూలు, సైకిల్ స్టాండ్ బిల్లులు వసూళ్లు చేస్తున్నారనే విషయంపై భీమవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఊహించని విధంగా అక్కడకు వెళ్లి వాస్తవాలు ద్రువీకరించుకొన్న తరువాత అక్కడ  అక్రమంగా పన్ను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత బస్టాండ్ లో దిగవలసిన  ఆర్టీసీ బస్సులు అక్కడ ఆగక పోవటం ఆ బస్సులకోసం ప్రయాణికులు జేపీ రోడ్ లో పడిగాపులు కాయడం ఏమిటని?  గ్రంధి ప్రశ్నించారు.. అంతేకాక ప్రైవేటు బస్సులకు అడ్డాగా మారిన పాత బస్టాండ్‌లోని బస్సులను తొలగించి, మళ్లీ ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను సూచించారు. ప్రవేటు వాహనాలు ఇక్కడ  ఇక బస్టాండ్ ను ఆక్రమిస్తే ఎలా? ఒక్క రోజు సమయం ఇస్తున్నాను ప్రవేటు  వాహనాలు ఖాళీ చెయ్యాలి అని  ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రంధి శ్రీనివాస్ మీడియా తో మాట్లాడుతూ.. స్థానిక మల్టి ప్లెక్స్  ఆవరణలో ఉండీ రోడ్  ను  ఆక్రమించి మోటారు సైకిల్ స్టాండ్  పీజు క్రింద మాజీ  ఎం ఎల్ ఏ పులపర్తి అంజిబాబు  గత 10 ఏళ్లుగా 7 కోట్ల రూపాయలు పైగా ప్రజల సొమ్ము దోచుకొన్నారని , టీడీపీ పాలకులు గతంలో ఇటువంటి దోపిడీతో మున్సిపాలిటీ ఆదాయానికి లోటు తెచ్చారని విమర్శించారు. 

 
 

Related Stories