తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరంలో ఇళ్ల లబ్దిదారులలో2,000మంది అనర్హులా?

Updated: September 3, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  రాష్ట్రంలో నే ఎక్కడ లేనివిధంగా భీమవరంలో రికార్డు స్థాయిలో సుమారు 9,000 ఇళ్ల నిర్మాణం (అపార్ట్మెంట్ తరహాలో ) చెప్పటి 70 శాతం నిర్మాణం పనులు పూర్తీ చేసుకొని  వాటి లబ్ది దారులకు రేపటి ఉగాదికి ఇస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా తెలిసిన నిజాలు మేరకు వాటిని 2,000 మంది అసలు భీమవరం పట్టణానికి చెందనివారుగా తాజా సర్వేలో నిర్ధారణ కావడం సంచలనం రేపింది. వీటి నిర్మాణం గతంలోకి వెళితే.. పేదలందరికీ ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఉచితంగా ఇవ్వాలని  సంకల్పంతో  భీమవరం పట్టణం శివారు  తాడేరురోడ్డులో స్వర్గీయ, ముఖ్యమంత్రి వైఎస్‌,  హయాంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరించారు. అయితే,  ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో 2017లో శంకుస్థాపన చేశారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల రూపాయలు అవకతవకలు జరుగుతున్నాయని నిర్మాణం వ్యయం కూడా భారీగా పెంచి అధికార పార్టీ  నేతలు అవినీతి కి పాల్బతున్నారంటూ,లబ్ధిదారుల ఎంపిక కూడా సక్రమంగా లేదని  అప్పటి  వైఎస్సార్‌  పార్టీ  కన్వినర్  గ్రంధి  శ్రీనివాస్‌ నేతృత్వంలో అనేక ఆందోళనలు చెప్పటి, కర్రపత్రాలు పంపిణి చేసి అప్పటి  కమిషనర్ ను స్వయంగా నిలదీయటం జరిగింది.  వాటిని నిజం చేస్తూ తాజాగా ప్రభుత్వం మారక, వాటిలోని అవకతవకలు ప్రస్తుత వలంటీర్ల సర్వేలో బయటపడుతున్నాయి. ఈ స్వర్వే ద్వారా  గత లబ్దిదారులను పోల్చి చుస్తే  భీమవరం పట్టణంలోనే సుమారు 2 వేల మంది పైగా  అనర్హులకు అక్రమార్గంలో ఇల్లు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. తాజా  సర్వే ప్రకారం అక్రమార్కులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరందుకోవడంతో ఇళ్ల కోసం సొమ్ములు చెల్లించిన లబ్ధిదారులు గతంలో తమ వద్ద ఇల్లు ఇపిస్తామని  లంచాలు తీసుకొన్న మధ్య వర్తులను అప్పటి ప్రజాప్రతినిధులను అధికారులను నిలదీస్తున్నట్లు, ఇది చినికి చినికి తుపానుగా మారి  కొందరి రాజకీయ జీవితాలకు ఇబ్బందిగా మారె పరిస్థితి స్వష్టంగా కనిపిస్తుంది.

 
 

Related Stories