తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

సిగ్మా న్యూస్ తో ఎంపీ రఘురామా..మేము సాధించి చూపిస్తాం

Updated: September 3, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఎంపీ, రఘురామా కృష్ణంరాజు నేడు,గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన 'సిగ్మా తెలుగు న్యూస్' అడిగిన పలు కీలక ప్రశ్నలకు ప్రత్యకంగా సమాధానాలు ఇచ్చారు. సిగ్మా ప్రసాద్ ప్రశ్న: మీరు సీఎం జగన్ ను వసిష్ఠ వారధి శంకుస్థాపనకు పిలుస్తున్నారు. కానీ ఇప్పటికే పలువురు సీఎంలు దానికి శంకుస్థాపనలు చేసారు. అలాగే విజ్జేశ్వరం వద్ద గోదావరి నుండి పైపు లైన్ ప్రాజెక్టు కూడా గత 2 ఏళ్లుగా పైగా ఉరిస్తున్నదే..కానీ ముందడుగు పడలేదు..మరో ప్రక్క రాష్ట్రంలో నిధుల కొరత, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మరో ప్రచారం.. మరి మీరు వీటిని ఎలా పూర్తీ చేసారు?.. దీనికి ఎంపీ రఘురామా కృష్ణం రాజు మాట్లాడుతూ..మీరు చెప్పినది నిజమే..కానీ వసిష్ఠ వారధి నిర్మాణంలో,మేము,ఒక సంకల్పంతో వెళుతున్నాము .కేంద్ర మంత్రి గట్కారీ ని కూడా సహకరిస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయంలో  కేంద్రం నుండి 70 శాతం నిధులు రాబట్టే పనిలో ఉన్నాం. ఒకవేళ కొన్ని  ఇబ్బందులు ఉన్న సీఎం జగన్ సహకారం మెండుగా ఉంది. గతంలో ఒక్క సీటురాని ఈ జిల్లాలో 13 సీట్లు వైసిపి వచ్చాయి.దానికి ప్రతిగా ప్రజలకు మేలు చెయ్యాలని సంకల్పిస్తున్నారు..ఇక కేంద్ర నిధులు రావడం లేదు అన్నది వాస్తవం కాదు..గత చంద్రబాబు  ప్రభుత్వహయాంలో కేంద్రంఇచ్చిన నిధులను కేటాయించిన ప్రాజెక్టులకు కాకుండా వేరే అవసరాలకు మళ్లించారు.దానికి ఇప్పుడు లెక్కలు చెప్పవలసి వస్తుంది. అందుకే, నిధులు రావాలంటే కేంద్రానికి మనం వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఏది ఏమైనా, ప్రాజెక్టులు 2 ఏళ్ళలో పూర్తీ చేస్తాం..ఈసారి,ఆగేదిలేదు..అని వివరణ ఇచ్చారు ఎంపీ రఘురామా కృష్ణంరాజు.. 

 
 

Related Stories