సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 29-8-2018 భీమవరం ను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను కొంత పరిష్కరించడానికి ఉపయోగపడే బైపాస్ రోడ్ కు రైల్వే గేటు ఏర్పాటుకు అనుమతులు వచ్చిన ఇప్పటికి పనులు నత్తనడక నడుస్తున్నాయని, ఎప్పటికి ప్రారంభిస్తారని భీమవరం మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం లో నేడు, బుధవారం కౌన్సిల్ సభ్యుడు భూసారపు సాయి వేసిన ప్రశ్నకు చైర్ పర్సన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ.. వచ్చే అక్టోబర్ 2వ తేదీన రైల్వే గేటు పెట్టడం బైపాస్ రోడ్ ప్రారంభించడం జరుగుతుందని, ఎటువంటి అనుమానాలు అక్కరలేదని, ఇటీవల రైల్వే సిగ్నల్ పరిమిషన్ రావడం కాస్త ఆలస్యం అయ్యిందని, అయితే అదికూడా వచ్చేసిందని, ఇక పనులు వేగం పెరుగుతాయని, రైల్వే గేటు క్రింద వేసే రోడ్ కావాలనే వేయలేదని, ఐతే ఇప్పుడు సిగ్నెల్ పర్మిషన్ రావడం తో వేగంగా పూర్తిచేసి గేటు ఏర్పాటు చేస్తారని సభకు వివరణ ఇచ్చారు..
|