తాజా వార్తలు   కరోనా కేసులలో భారత్ వేగం ఎంత ఆందోళనకరమంటే.. | ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. |

భీమవరం కౌన్సిల్లో..LED లైట్స్ తీసేసి చూపులైట్స్ పెట్టండి.

Updated: September 3, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 29-8-2018భీమవరం మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ..బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక కౌన్సిల్ హాలులో చైర్ పర్సన్ కొటికలపూడి గోవిందరావు అడ్జక్షతన ప్రారంభమయింది. ఎజెండాలో 13 అంశాలు చర్చకు వచ్చాయి. ముందుగా సభలో చర్చను ప్రతిపక్ష వైసిపి కౌన్సిలర్ విజయ దుర్గ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ భీమవరం లో ప్రధాన ట్రాఫిక్ సమస్యను  పరిష్కారించాలని, ప్రధాన రోడ్లపై  షాపుల వారు రోడ్ మార్జిన్ అతిక్రమించి తమ సామాను పెడుతున్నారని, రోడ్డుపై వెళ్లే వ్యక్తుల  ప్రక్కనుండి వాహనాలు ప్రమాదభరితంగా దూసుకొని పోతున్నాయని, చాల మంది గాయాల పాలవుతున్నారని, ఇక 2వ అంశం కరెంట్ ఆదా అవుతుందని వేసిన ఎల్ ఈ డి లైట్స్ తీసివేయాలని, పాత చూపులైట్స్ మేలని ఎందుకంటే ఉదయం .. పగలే వెన్నెల లా వెలుగుతున్న ఎల్ ఈ డి లైట్స్ రాత్రి అయితే వెలగడం మానేస్తున్నాయని చెప్పగా , అధికార పక్ష కౌన్సెలర్స్ కూడా అదే విషయాన్ని సమర్ధించగా ఇక చైర్ పర్సన్ కూడా ఎల్ ఈ డి లైట్స్ వల్ల కొత్త ఇబ్బందులు వచ్చినమాట వాస్తవమే నని అంగీకరించారు. అయితే మన పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పడికిపుతూ లైట్స్ విషయం మార్చడం ఫై మరింత చర్చించాలని, అయితే కమిషనర్ సభ్యుల ఆరోపణ లను పరిశీలించాలని సూచించారు. ఇక ట్రాఫిక్ సమస్య విషయానికి వస్తే రోడ్స్ ఆక్రమిస్తున్న షాపుల యజమానులకు తగిన సూచనలు చేయాలనీ, ప్రతి 10 మీటర్లు కు రోడ్డుపై బోర్డర్  కోడ్ పెట్టాలని అది అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ నరసింహారావు ను కోరారు. 

 
 

Related Stories