తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

భీమవరంలో నిర్లక్ష్యంవల్లే వరద నష్టం..పాపం ఎవరిదీ?

Updated: September 3, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణం శివారుల్లో తో పాటు నగర నడిబొడ్డున ప్రవహించే యనమదురు కాలువ గట్టుకు సమానతరంగా ప్రవేశిస్తూ ఉధృతితో ఉండటంతో  పరివాహక ప్రదేశాలకు కిరువైపులా ఎక్కువ శాతం వన్ టౌన్ వైపు , మరియు జి అండ్ వి కెనాల్, తాడేరు, బ్యాంకు కాలనీ వైపు నేటి శుక్రవారం కు కూడా నీరు నిలిచిపోయి ఉంది. పొలాలకు గండి కొట్టడం తో మిషనరీ ఆసుపత్రి వెనుకవైపు వందలాది ఎకరాలు ముంపుకు గురి అయ్యాయి. వివిధ ముంపు ప్రాంతాలలో ప్రజలు ఇసుక బస్తాలు నీటికి అడ్డపెడుతూ గత  3 రాత్రులు  గస్తీ కాయడం జరిగింది. గండ్లు పడటంతో  రైతులు తీవ్రంగా నష్టపోయారు.   ఇక వరద భయానికి తోడు రోకటి పోటులా నేటి శుక్రవారం  ఉదయం నుండి కురుస్తున్న వర్షం దెబ్బకు ప్రజలు మరింత భయానికి లోనయ్యారు. అయితే వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో ప్రజలు కుదుట పడ్డారు. ముంపు ప్రాంతాల బాధితులు కు పునరావాస ఏర్పాట్లను వారికీ సౌకర్యలను మునిసిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.పరామర్శకు వెళ్లిన ప్రజా ప్రతినిధుల ముందే తమ ను పట్టించుకొనే నాధుడు లేదని, కనీసం వరదనీరు ఆపడానికి ఇసుక బస్తాలు కూడా అధికారులు ఇవ్వలేకపోయారని , స్వంత ఖర్చుతో తమ తిప్పలు తాము పడుతున్నామని స్థానికులు  నిలదీయడం జరిగింది.అక్కడ ఎర్రకాలువ కు భారీ వరద వచ్చిందని తెలియగానే  ఇక్కడ రక్షణ   చర్యలు తీసుకోకుండా,  వరద ఉదృతిని ఇరిగేషన్ తక్కువ గా అంచనా వేయడం , స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళిక లు , సమావేశం నిర్వహించకపోవడం పట్ల కూడా ప్రజల నుండి, ప్రతిపక్ష పార్టీనేతల  నుండి  విమర్శలు ఎదురుతున్నాయి.  

 
 

Related Stories