తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

భీమవరంలో పేదల గృహాలు ఫిబ్రవరికి పూర్తీ చేసేద్దాం..

Updated: August 27, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 21-8-2018 భీమవరం లో పేదలకు గృహాల నిర్మాణం వాటి లబ్ధిదారుల కు అందజేసే  ప్రకియ ఫై చైర్ పర్సన్ కొటికలపూడి గోవిందరావు అడ్జక్షతన మునిసిపల్ కౌన్సిల్  హాలులో  నేడు, మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. దీనిలో అన్ని పార్టీలకౌన్సిల్  సభ్యులు దాదాపుగా హాజరయినట్లు సమాచారం. దీనిలో పలువురి  సభ్యులు సందేహాలకు చైర్ పర్సన్ వివరణ ఇస్తూ..  తాడేరు వద్ద సుమారు 8,000 పైగా లబ్దిదారులకు కేటాయిస్తున్న గృహాల నిర్మాణం లో ,ఇప్పటికే ,మొదటి బల్క్ గా 2,200 పూర్తీ అయినప్పటికీ , మిగతా గృహాలు నిర్మాణం కూడా శరవేగంగా వచ్చే 2019 ఏడాది  ఫిబ్రవరి లోగ పూర్తీ చేసి అన్నిటికి ఒకేసారి కరెంట్ , నీటి కుళాయిలు సరఫరా వంటి మౌలిక సదుపాయాలు  కల్పించే పంపిణి చేయడం జరుగుతుందని , సభ్యులు సహకారం కావాలని కోరినట్లు తెలుస్తుంది. పేదలకు ఇళ్ల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని , అంత ఆన్ లైన్ వ్యవ్యహారం క్రింద జరుగుతుందని, అన్ని పార్టీ కౌన్సెలర్స్ వార్డులలో ప్రజలకు ఒకే తరహా నిబంధనలు వర్తిస్తాయని , ఏ నిజమైన లబ్ధిదారుడికి నష్టం లేకుండా చూస్తామని మాట్లాడారు. అయితే ప్రతిపక్ష నేత, గాదిరాజు  తాతారాజు  కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాగా, ముఖ్యంగా పేదలకు లోన్స్ వ్యవ్యహారం లో, రేటు విషయంలో  వారి నుండి ఎక్కువ డబ్బు తీసుకోని వ్యాపారం చేస్తున్నట్లు కనపడుతుందని, వారికీ మేలు చేస్తున్నట్లు లేదని, దీనిపై  ఆలోచించాలని కోరగా , ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పాలసీ మేటర్ అని, భీమవరం కొక పద్దతి , వేరేచోట మరో పద్దతి ఉండదని, లబ్దిదారులకు గృహాలు నాణ్యత లోపం లేకుండా ఉన్నత ప్రమాణాలతో అందజేయడం మన విధానం కావాలి  తప్ప ఇటువంటి తర్కం మంచిది కాదని వరించినట్లు సమాచారం.. మొత్తానికి పేదల గృహాల నిర్మాణం ఈ కౌన్సిల్ హయాంలో పూర్తీ చేయాలనీ నిర్ణయం.. అవుతుందంటారా..?

 
 

Related Stories