తాజా వార్తలు   భీమవరంలో అతి త్వరలో భారీ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం | ఢిల్లీలో విశాఖ ఉక్కు ప్రేవేటీకరణ నిరసనలో వైసిపి ఎంపీలు | శ్రీ మావుళ్ళమ్మ వారికి 10 గ్రా.బంగారం కానుక | ఏపీలో రిజిస్ట్రేషన్ల పక్రియ చాలా వేగంగా..కొత్త టెక్నాలజీ | నాగార్జున, నాగ చైతన్యల బంగార్రాజు సంక్రాంతికి.. | ప.గో.లో రాట్నాలమ్మ మొక్కు చెల్లిస్తాను..పివి సింధు | పార్లమెంట్ సభలలో సింధుకు అభినందనలు | భీమవరం 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు | భీమవరంలో డా.యల్లాప్రగడ..స్మారక సత్కారాలు | చించినాడ,గోదావరి లో దూకిన నలుగురు మృతి |

భీమవరం మున్సిపల్ అధికారులపై సభ్యులు గరం- గరం

Updated: October 6, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 28-9-2019 , శుక్రవారం  భీమవరం మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం లో  పలు కీలక  సమస్యలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. సభలో ఎక్కువ సమయం 32 వార్డులో ఒక నిర్మాణం గురించి జరిగినప్పటికీ , మిగిలిన కొద్దీ సమయంలో మంచి అంశాలను సభ్యులు చర్చకు తీసుకొనివచ్చారు. అధికార పక్ష కౌన్సెలర్స్ కూడా పట్టణానికి చెందిన మురుగు, దోమలు,నివారణ సమస్యలు, ప్రస్తావించారు. కౌన్సిలర్ చందు అయితే    మునిసిపల్ ఆఫీసులో టేకు చెట్లను కొట్టి  ఉద్జోగులు అనధికారిక ఆదాయాలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేయడం తో పాటు, పత్రికలలో కధనాలు వచ్చిన పట్టించుకోరా? అంటూ ప్రశ్నించడంతో, వాటిపై  అడ్జక్ష స్థానంలో ఉన్న   మునిసిపల్ చైర్ పర్సన్ కొటికలపూడి గోవిందరావు సంబంధిత అధికారులను వివరణ కోరటం,( వారు చెట్లు చిన్నవని , అందుకే వాటిని కొట్టి బయట పడవేశామని చెప్పడంతో..)  ఇలాంటివి సమాధానాలు   సహించమని, చెట్ల కలప తక్కువైనా, సరే రికార్డ్స్ కు ఎక్కించి తీరాలని , ఇప్పుడు సభ్యులు నుండి ఇలాంటి ప్రశ్నలు వస్తే మీదగ్గర జవాబుదారీ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ పక్షనేత భూపతి రాజు శ్రీనివాసవర్మ అయితే  మున్సిపాలిటీ లో ఎం ఈ  ఫై తన ఆగ్రహం ప్రకటించారు. తన వార్డులో 2 ఏళ్ళనుంచి కాంట్రాక్టర్ కు టెండర్ ఆమోదించిన కొన్ని పనులు చేయకుండా అలాగే పెండింగ్లో ఉంచారని, దీనిపై స్వయంగా చైర్ పర్సన్ కూడా గతంలో పలుమారులు ఎం ఈ నిఆదేశించిన  ఇప్పటికి దిక్కులేదని, తమను అధికారులు తక్కువ అంచనా వేయవద్దని , ప్రజల కోసం అనుకున్న పనులు చేయకపోతే అవమానపడి మీరు స్థాయి తగ్గించుకోవాలని వస్తుందని సభలోనే అధికారులపై మండిపడ్డారు.

 
 

Related Stories