తాజా వార్తలు   భీమవరంలో అతి త్వరలో భారీ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం | ఢిల్లీలో విశాఖ ఉక్కు ప్రేవేటీకరణ నిరసనలో వైసిపి ఎంపీలు | శ్రీ మావుళ్ళమ్మ వారికి 10 గ్రా.బంగారం కానుక | ఏపీలో రిజిస్ట్రేషన్ల పక్రియ చాలా వేగంగా..కొత్త టెక్నాలజీ | నాగార్జున, నాగ చైతన్యల బంగార్రాజు సంక్రాంతికి.. | ప.గో.లో రాట్నాలమ్మ మొక్కు చెల్లిస్తాను..పివి సింధు | పార్లమెంట్ సభలలో సింధుకు అభినందనలు | భీమవరం 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు | భీమవరంలో డా.యల్లాప్రగడ..స్మారక సత్కారాలు | చించినాడ,గోదావరి లో దూకిన నలుగురు మృతి |

భీమవరం కౌన్సిల్లో,ప్రెవేటు కట్టడంపై హోరాహోరీ..బెదిరిసున్నారా?

Updated: October 6, 2018

 సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 29-0-2018 భీమవరం మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నేడు, శుక్రవారం స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హల్ లో మునిసిపల్ చైర్ పర్సన్ కొటికలపూడి గోవిందరావు అడ్జక్షతన జరిగింది. అజెండాలో కీలకమైన 21 అంశాలను చేర్చడం జరిగింది. నేటి సభలో సుమారు  గంట సమయం స్థానిక 32 వ వార్డులో రియల్టర్  పాల శ్రీనివాస్  నిర్మిస్తున్న  అపార్ట్మెంట్ గురించే జరిగింది. ఈ అంశాన్ని ప్రతి పక్ష నేత గాదిరాజు సుబ్బా తాతారాజు సభ దృష్టికి తేగా, మధ్యలో రాపర్తి వెంకటరామయ్య  తన అనుమానం నివృతి చేసుకొనే ఉద్దేశ్యం తో తాతారాజును  మరో ప్రశ్న వేయడంతో  దానికి తాతారాజు, కొల్లు ప్రసాదులు  తీవ్ర అభ్యన్తరం చెప్పారు. అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసా? స్థానిక నివాసం ఉన్న ప్రజలు గోడు పట్టించుకోరా? బురద పాలన జరుగుతుంది,   అసలు టౌన్ ప్లానింగ్ అనుమతి ఎలా ఇచ్చింది? మాస్టర్ ప్లానింగ్ లో అసలు అక్కడ రోడ్డు వివరాలు కూడా లేవు? అని ప్రశ్నించడం తో టౌన్ ప్లానింగ్ అధికారుల వివరణ తీసుకొన్న చైర్ పర్సన్ గోవిందరావు కూడా ఆగ్రహంతో  మాట్లాడుతూ.. అక్కడ  స్థలాలకు 1987 లో లే అవుట్ లు అయ్యాయని, దానిపై కోర్టులో గత 7 ఏళ్లుగా కేసు నడుస్తుందని నా దృష్టికి వచ్చిందని,  అసలు అక్కడ సమస్య మునిసిపాలిటీకి సంబందించినది, మీరు ఏమైనా పిర్యాదు చేస్తే కమిషనర్ కు  లిఖితపూర్వకంగా పిర్యాదు చేయాలనీ కోరగా దానిపై తాతారాజు కు  చైర్ పర్సన్ కు తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఏమిటి సభ సమయం వృధా చేస్తున్నారు? అసలు పట్టణంలో అబివృధే జరగనట్లు ఆరోపణలు చేస్తున్నారు? వందల కోట్లు తో  ఒక ప్రక్క రికార్డు స్థాయిలో అభివృద్ధి, పేదలకు 9,000 ఇళ్ల నిర్మాణాలు  జరుగుతుంటే, ఇంత చులకనగా మాట్లాడుతున్నారు? మీరు ఇలాగె ఉండండి.... మీరు పనులు చేయించుకోలేదా? మరల మీరు అభివృద్ధి పనులు కోసం వచ్చినపుడు చూద్దాం.. అనడంతో తాతారాజు మరింత కోపంతో .. ఏమిటి నన్ను బెదిరిస్తున్నారు?  అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో, ప్రజా బలం తో ఏమి చేయించుకోవచ్చో.. నాకు తెలుసు.. నా ప్రజల కష్టం చెప్పాను నా స్వంతానికి ఏమైనా కోరలేదుకదా? అని ప్రశ్నించడం మధ్యలో  కౌన్సెలర్స్ మెంటే గోపి, బీజేపీ పక్ష నేత, బి. శ్రీనివాస వర్మ కలుగజేసుకొని సముదాయించి,  కొందరు అధికారులు సహకరించని మాట వాస్తవమేనని, అయితే అసలు అభివృద్ధి జరగటంలేదు అనడం భవ్యం కాదని చెప్పటంతో అక్కడితో మిగతా సమస్యలపై చర్చకు దారి కల్పించారు. 

 
 

Related Stories