తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

శ్రీ మావుళ్ళమ్మ సాక్షిగా జనసేన మేనిపెస్టో తో పవన్

Updated: August 16, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 14-8-2018, భీమవరం,  నా జనసేన ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేసింది అని గతంలో గర్వముగా ప్రకటించిన  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  అదే భీమవరం  పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ  మావుళ్ళమ్మవారి  సాక్షిగా తన పార్టీ మేనిపెస్టోను అమ్మవారికి సమక్షంలో ప్రత్యక పూజలు చేసిన అనంతరం విడుదల చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు. అవి.. 
సిద్ధాంతాలు..
1. కులాలను కలిపే ఆలోచనా విధానం
2. మతాల ప్రస్తావన లేని రాజకీయం
3. భాషలను గౌరవించే సంప్రదాయం
4. సంస్కృతులను కాపాడే సమాజం
5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
6. అవినీతిపై రాజీలేని పోరాటం
7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
హామీలు..
1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు
3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ
4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు
5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన
7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు
11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
 
 

Related Stories