తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

కచ్చితంగా ముందస్తు ఎన్నికలు.. పార్టీల లెక్కలు ఏమిటంటే.

Updated: July 10, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: దేశ వ్యాప్తంగా అటు  లోక్ సభకు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలపి సుమారు 8 ముఖ్య రాష్ట్రాలలో శాసనసభకు  కలపి కచ్చితంగా ఈ ఏడాది చివరినాటికి ఎన్నికలు జరిగి తీరుతాయని భవిస్తున్న నేపథ్యంలో .. బీజేపీ దేశ వ్యాప్తంగా  ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో గెలుస్తమని భావిస్తూ యాత్రలతో  ప్రజలను  చైతన్యం చేయడంలో వేగం పెంచింది. తాజగా   రైతులకు కూడా మంచి మద్దతు ధర పెంచి మోడీ ప్రభుత్వం మార్కులు కొట్టేసే పనిలో బిజీగా ప్రచారం అందుకొంది ముందస్తు వల్ల ప్రతి పక్షాలు బలపడటానికి అవకాశం ఉండదు. అధికారానికి  కొద్దీ సీట్లు తగ్గినా, పెద్దపార్టీగా అవతరించే అవకాశం ఉంది.  ప్రతిపక్ష కాంగ్రెస్‌ దృష్టి  తాను అధికారంలోకి  రావడానికి తగిన సమయం లేదు అని తెలుసుకొని, ఒక ప్యూహం ప్రకారం రానున్న ఎన్నికలలో బీజేపీ ని ముందు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని  భవిస్తూ అన్ని పార్టీలను కలుపుకొని  అధికారాన్ని పంచుకొనే స్థితిలో పనిచేస్తుంది. ఇటు, తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాలు, క్యాడర్‌ సమావేశాలతో ఏపీ లో  అధికార తెలుగు దేశం, తెలంగాణాలో   టీఆర్‌ఎస్‌  ముందడుగు వేస్తున్నాయి, ముఖ్యంగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలను స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇవ్వడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. ఎన్నికల కోడ్‌ వస్తే అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనుండడంతో, ఆలోగానే వీలైనన్ని పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. తెలంగాణాలో  బీజేపీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇచ్చే పరిస్థితిలో జవసత్వాలు కూడదీసుకొంటుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు కేంద్రంపై విమర్శలు ,దీక్షలు పెంచారు. ముందస్తు వస్తే స్థానిక సంస్థలు కూడా అప్పుడే జరిపించేస్తానని ఎన్నికల వేడి మరింత పెంచి క్యాడరును సిద్ధం చేస్తున్నారు.  అటు  వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే 2,500 కిమీ పూర్తీ చేసి మరో 500 కిమీ పూర్తిచేసేందుకు జనంలో దూసుకొనిపోతున్నారు. త్వరితంగా 3000 పూర్తీ చేసి మరల ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలి. కాబట్టి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా పాదయాత్రలో నే ఒక అవగాహనకు వచ్చేస్తున్నారు. నవరత్నాలు అంటూ  ప్రజలపై వరాలు జల్లు కురిపిస్తున్నారు..  మరో వైపు జనసేన అధినేత పవన్ ఉత్తరాంధ్ర ప్రచారంలో ఊపుమీద ఉన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు పవన్ తో దోస్తీకి సిద్ధం అంటున్నాయి. కర్ణాటక కుమార స్వామి  తరహాలో పవన్ ఆలోచిస్తున్నాడంటున్నారు..?. మొత్తానికి ప్రకటన లేకుండానే అని పార్టీలు ఎన్నికల శంఖం పూరించేసాయి.. ప్రచారం లో పిండి కొద్దీ రొట్టె .. అన్న రీతిని ప్రజలను , క్యాడరును ప్రభావితం చేసే పనిలో ఉన్నాయి..  sigma prasad coloms..  www.sigmatelugu.com
 
 
 

Related Stories