తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

భీమవరంలోమంత్రి నారాయణ...పేదల గృహాలు...

Updated: November 20, 2017

సిగ్మాతెలుగు డాట్ కం, న్యూస్: 19-11-2017,ఆదివారం మధ్యాహ్నం 12. 40 నిమిషాలకు   భీమవరంలో ప్రకాశం చౌక్ సెంటర్లో పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఎంపీ తోటసీతారామలక్ష్మి,  స్థానిక ఎం ఎల్ ఏ, పులపర్తి అంజిబాబు, మునిసిపల్ చైర్ పర్సన్ కే. గోవిందరావు , మునిసిపల్ కమిషనర్ నరసింహారావు, జిల్లా అధికారులు   మరియు పలువురు ప్రజాప్రతినిధులు ,తెలుగుదేశం పార్టీ నేతలు  పట్టణంలోకి స్వగతం పలకడం  జరిగింది. తదుపరి మంత్రి నారాయణతో పాటు వీరంతా భారీ కాన్వాయి తో తాడేరులో  82 ఎకరాలలో ప్రభుత్వ  నిధులతో పేదలకోసం  నిర్మిస్తున్న గృహాల నిర్మాణం పరిశీలించడం జరిగింది.  పూర్తీ అవుతున్న ఒక జి ప్లస్ 3 అపార్ట్మెంట్ భవనం లోపల పనితీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎంపీ తోట సీతారామ లక్మి, ఎం ఎల్ ఏ అంజిబాబు ,చైర్ పర్సన్ కే. గోవిందరావు లు తమ ప్రసంగాలలో జిల్లాలోనే రికార్డు స్థాయిలో భీమవరం లో నిర్మిస్తున్న 9,000 పేదల గృహాల జి ప్లస్ 3 అపార్ట్మెంట్స్ కు ప్రభుత్వం తరపున అందిస్తున్న సహకారానికి మంత్రి నారాయణకు కృతజ్నతలు తెలిపారు. తదుపరి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేదలకు 5 లక్షల 39 వేల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెటుకోందని, అందులో ఒక్క భీమవరంలోనే  9,000 ఇళ్లకు శ్రీకారం చుట్టడం, ఇక్కడ నేతల కృషితో పనులు కూడా వేగవంతంగా జరగడం అభినందనీయం ఇక్కడ 82 ఎకరాల స్థలాన్ని ఫుడ్చడానికే  8 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం దానికి ప్రభుత్వం సహకారం మాములు విషయం కాదని , ఎల్ అండ్ టి వంటి ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో మంచి క్వాలిటీతో , ఎన్ని అడ్డంకులు వచ్చిన  త్వరితంగా గృహాలు పూర్తీ చేయడం, అవినీతి రహితంగా వాటిని పేదలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉందని,  మంత్రి నారాయణ పేర్కొన్నారు.

 
 

Related Stories