తాజా వార్తలు   భీమవరం పంచారామంలో మహాశివరాత్రి వేడుకలు..9 నుండి | షర్మిలకు ఆస్తులు,పదవులు ఇవ్వకుండా మోసం..చంద్రబాబు | ఇక రాజకీయాలకు దూరం..శశికళ సంచలన ప్రకటన | ఏలూరు,,మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమం | తూగో జిల్లా తీర్పు ఏకపక్షమే..తాజాగా ఏకగ్రీవాలలో కూడా | మున్సిపల్ నామినేషన్స్ ఘట్టం పూర్తీ .గోదావరి జిల్లాలలో వైసిపి ఏకగ్రీవాలు,, | నిమ్మగడ్డకు ఒక రోజులో హైకోర్టు లో షాక్ మీద షాక్ | ఏపీలో12 పంచాయతీలులోఎన్నికలుకు కొత్త నోటిఫికేషన్ | సంచలనం: ఏలూరులో3 వైసిపి కార్పొరేట్ అభ్యర్థులు ఏకగీవం | హరిహర వీరమల్లు...ఫై భారీ భారీ సంగతులు |

శ్రీ శక్తేశ్వర పుణ్య క్షేత్రం,యనమదుర్రు

Updated: June 1, 2020

సిగ్మాతెలుగు డాట్ కం, (దేవుళ్ళు.. ఆర్టికల్) భీమవరం పట్టణానికి సుమారు 6 కి. మీ  దూరంలో యనమదురు గ్రామంలో వేంచేసిన స్వయం భూ. గా వెలసిన శ్రీ శక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రం పరమ శివుని భక్తులకు, ప్రాణ భయం ఉన్నవారికి సర్వదా రక్షణ కలిగించే మహత్తు ఉన్న ప్రాంతంగా పురాణ గాధలు చెబుతున్నాయి. స్కంధ పురాణం ప్రకారం యమధర్మ రాజు స్వయంగా ఇక్కడి శక్తేశ్వరుడిని ప్రతిష్టించాడని, అలాగే దేవాలయం నిర్మించి, దానికి ఎదురుగా కోనేరు ను స్వయంగా నిర్మించాడని, ఈ కోనేరులో పవిత్ర స్థానం చేసి శ్రీ శక్తేశ్వరుని పూజిస్తే, అకాల ప్రాణ భయం లేకుండా వరం ఇచ్చాడని పండితులు చెబుతారు. పురాణ కాలం నుండి నేటి వరకు స్వామికి ఈ కొలను లోని మంచినీటి తొనే ప్రసాదాలు తయారు చేస్తారు. లేకపోతె స్వామికి సహించదు. ఒకపుడు కొలను బాగు  చేద్దామని నీరు ఎండబెట్టటంతో, మరో చోటనుంచి తెచ్చిన నీటితో స్వామికి ఫలహారం వండుతుంటే. ఎన్నిగంటలు గడచినా అది ఉడకటంలేదట. దానితో పురోహితులు, మరల కొలనులో గుంత తవ్వి నీరు సేకరించి వండితే, క్షణంలో వంట పూర్తీ అయిందని పెద్దలు చెబుతారు. అంత మహిమ చూపే శ్రీ శక్తేశ్వరుని విగ్రహం తలక్రిందులుగా శివుడు యోగ ముద్రలో ఉండటం విశేషం. ఈ తరహా అద్భుతం మన దేశంలో ఎక్కడ కనిపించదు. పంచారామ సోమేశ్వరునిగా రంగులు మారె శివలింగం కూడా భీమవరంలోనే ఉండటం గమనార్హం. అకాల ప్రాణ భయం లేకుండా చేసే శక్తేశ్వరుని నుండి అభయం పొందడానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా వస్తారు. ప్రతి సోమవారం, శివరాత్రి, శ్రావణమాసం, కార్తీక మాసాలలో వేలాదిగా భక్తులు స్వామి అనుగ్రహం కోసం, పార్వతి అమ్మ వారి కరుణ కోసం, యమధర్మరాజు దయ కోసం ఇక్కడికి వచ్చి విశేష పూజలు జరిపిస్తారు. పచ్చని ప్రకృతిలో స్వయం భువునిగా  వెలసిన శ్రీ శక్తేశ్వరుని  దర్శించుకున్న భక్తులు  పుణ్య ఫలాని పొందగలరు... sigmatelugu.com, news desk,  sigmatelugu@gmil.com

 
 

Related Stories