తాజా వార్తలు   ఇక రాజకీయాలకు దూరం..శశికళ సంచలన ప్రకటన | ఏలూరు,,మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమం | తూగో జిల్లా తీర్పు ఏకపక్షమే..తాజాగా ఏకగ్రీవాలలో కూడా | మున్సిపల్ నామినేషన్స్ ఘట్టం పూర్తీ .గోదావరి జిల్లాలలో వైసిపి ఏకగ్రీవాలు,, | నిమ్మగడ్డకు ఒక రోజులో హైకోర్టు లో షాక్ మీద షాక్ | ఏపీలో12 పంచాయతీలులోఎన్నికలుకు కొత్త నోటిఫికేషన్ | సంచలనం: ఏలూరులో3 వైసిపి కార్పొరేట్ అభ్యర్థులు ఏకగీవం | హరిహర వీరమల్లు...ఫై భారీ భారీ సంగతులు | పాలకొల్లులో ఇంటి అద్దె అడిగాడని చంపేసిన కసాయి | మంత్రిగారి రాసలీలల నిర్వాకం..బీజేపీ కి సంకటం |

శ్రీ ఉమాభీమేశ్వర ఆలయం,భీమవరం

Updated: June 1, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్: శ్రీ ఉమాభీమేశ్వర ఆలయం, సుమారు 1200 సంవత్సరాల క్రితం  నిర్మించిన దేవాలయాల్లో అతి పురాతన మైన దేవాలయంగా శ్రీ ఉమాభీమేశ్వరాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఇతిహాస కాలంలో ఈ ప్రాంతం అంతా దండకారణ్యంతో ఉండేదని, మౌర్య సామ్రాజ్య కాలంలో కొంతవరకు దీనిని మానవ  నివాస యోగ్యంగా తీర్చిదిద్దారని చరిత్రకారుల పరిశోధన గ్రంథాల వల్ల తెలుస్తుంది. చాణుక్య రాజుల కాలంలో ఉభయ గోదావరి జిల్లా లో వారు నీరిమించిన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి.  చాళుక్య భీముడు నిర్మించిన శ్రీ భీమేశ్వర ఆలయం కారణంగానే ఈ పట్నానికి  భీమవరం అని పేరు వచ్చిందని అభిప్ర్యాయం ఉంది. ఆయన కాలంలోనే భీమవరంలో భీమేశ్వరస్వామి ఆలయం వెలసినట్టుగా చెబుతారు. దీనిని కీస్తుశకం 890-918 కాలంలో నిర్మించినట్లు పురావస్తు పరిశోధకులు  నిర్దారించారు.
ఆలయంలో విశిష్టతల గురించి చెప్పుకుంటే..
భీమేశ్వరుని శివలింగం ఐదు అడుగుల ఎత్తున ఉంటుంది. మహిషాసురమర్ధని అమ్మవారు వైష్ణవ రూపంలో నాలుగు హస్తాలతో ఉంటారు. ఈ హస్తాల్లో శంఖు, చక్ర, అభయ, వామన రూపం పట్టినట్లు ఉంటుంది. అమ్మవారి ఎడమ చేతిలో చక్రం, కుడిచేతిలో శంఖం ఉండడం విశేషం. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి దేవాలయం లేదని చెబుతారు. అందుకే అమ్మ వారిని ఇక్కడ పూజిస్తే వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతారు.ఈ మధ్య కాలంలో దాతల సహకారంతో వాస్తు తో సహా దేవాలయాన్ని ఆధునికరించారు.
ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు : శివరాత్రికి ఐదు రోజులు పాటు ఉత్సవాలు,పూజలు, కార్తీకమాసంలో నెలరోజులు కార్తీక పూజలు, ఉపన్యాసాలు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులూ పూజలు, దేవి అవతారాలు,సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రాంగణంలో సీతారాములు, శ్రీ రాధా కృష్ణుడు , శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి ఉప  ఆలయాలు ఉన్నాయి. శ్రీ ఉమా భీమేశ్వర దర్శన భాగ్యం సర్వ శ్రేయోదాయకం..
ఓం నమః శివాయ....
sigmatelugu.com   sigmatelugu@gmail  devullu articals

 
 

Related Stories