తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాటిజివ్‌ కేసులు 5 లక్షల చేరువలో..

Updated: March 29, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కొరోనా వైరస్ దాదాపు ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ మానవాళికి  తన సత్తా రుచి చూపిస్తుంది. నేటి  గురువారం ఉదయం  నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాటిజివ్‌ కేసులు 4,17,417 నమోదు అయ్యి.. ఆ సంఖ్య ఐదు లక్షల చేరువలోకి వేగంగా పరుగులు పెడుతుంది. మరోవైపు మృతుల సంఖ్యా అంతకంతకూ పెరుగుతూ ఇప్పటి వరకు తాజా వార్త కధనాల ప్రకారం మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరింది. చైనా లో తాజా పరిస్థితి ఫై విభిన్న వాదనలు ఉన్న దృష్ట్యా,  ప్రస్తుతం కరోనా తీవ్ర ప్రభావం  ఇటలీపై పడింది. . ఆ దేశంలో మొత్తం 74,3 86 పాజిటివ్ కేసులు, 7,503 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీ తర్వాత కరోనా అంతటి ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై చూపుతోంది. యూఎస్‌లో మొత్తం 68,421 కరోనా పాజిటివ్ కేసులు తేలగా.. సుమారు 1000  మరణాలు సంభవించాయి. మరోవైపు స్పెయిన్, జెర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. స్పెయిన్‌ మృతుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మన భారత దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649కి చేరింది. మృతుల సంఖ్య 13కి చేరింది
 
 
 

Related Stories