తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

గోదావరి జిల్లాలలో పోలింగ్ తాజా పరిస్థితి.. ఉద్రిక్తలు

Updated: April 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేటి గురువారం ఉదయం 7గంటల నుండి పరిషత్తు ఎన్నికల ఓటింగ్ ప్రారంభయ్యింది. రాష్ట్రంలో  515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది దీనిలో భాగంగా గోదావరి జిల్లాలయిన తూర్పులో  61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు, ‌పశ్చిమలో 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్  జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు 35 శాతం ఓటింగ్ పోలయింది . కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటర్లు మాస్క్ ధరించి తమ ఓటుహక్కు ను వినియోగించుకొంటున్నారు.ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.  అమలాపురం రూరల్‌ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థి ఆందోళన చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను  అధికారులు నిలిపివేశారు. దుగ్గిరాల గ్రామంలోని అతి సమస్యత్మాక పోలింగ్ కేంద్రాం వద్ద జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఏలూరుడీఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. జనసేన కార్యకర్తలు పెదపట్నంలంక-సత్తెమ్మపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగపడ్డారు. ఓటర్లకు జనసేన డబ్బు పంచుతుండగా వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల రాళ్ల దాడిలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
 
 
 

Related Stories