తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

ఏలూరు కార్పొరేషన్ ఫలితాలకు ఇంకా తప్పని నిరీక్షణ

Updated: April 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: రాష్ట్రంలో ఆఖరికి పరిషత్తు ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. ఫలితాలు వెలువడబోతున్నాయికానీ,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపునకు ముహూర్తం ఇంకా సస్పెన్సులోనే ఉంది. దీనిపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 1న విచారణ జరగాల్సి ఉన్నా అప్పట్లో పిటీషన్‌పై వాదోప వాదాలు జరగలేదు. నిన్న బుధవారమైనా వాదోపవాదాలు జరిగి కోర్టు తీర్పు వెలువడుతుందని  భావించారు. కానీ ఆదేశాలు రాలేదు. లేదు  అనేక ఇతర కేసులు విచారణ  జరగడంతో సమయాభావం వల్ల ఏలూరు కౌంటింగ్‌ కేసులో వాదనల కు తావులేకపోయింది. తమ విజయాలపై వైసిపి నేతలు పైకి ధీమాగా ఉన్నపటికీ కార్పొ రేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెలకొన్న ప్రతిష్టంభనతో  పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికలు ముగిసి ఇన్నిరోజులయిన టెంక్షన్ తప్పడం లేదు. 

 
 

Related Stories