తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

భీమవరంలో విద్యార్థుల నిరసన ర్యాలీ..డిమాండ్స్

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  భీమవరం లో నేడు,మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు  కొత్త బస్టాండ్ నుంచి తహసిల్దార్ కార్యాలయము వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్నా విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 77, జీవో నెంబర్ 35 లను వెంటనే రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్  జిల్లా అధ్యక్షులు డి. పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో పారిశ్రామిక  నగరం గా ఉక్కు నగరంగా పేరును తీసుకువచ్చిన  విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దంటూ పాలకులను హెచ్చరించారు . మా యువతకు మా భవితకు అడ్డొచ్చే వారెవరు, ఎదురొచ్చే వారెవరు ,విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదించారు..ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం దగ్గర  ఎస్ఎఫ్ఐ సభ లో వక్తలు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందన్నారు. 

 
 

Related Stories