తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

రూపాయితో టిడ్కో ఇల్లు..ఏపీ కాబినెట్ సంచలన నిర్ణయాలు

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నేడు, మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కింద వారికి అందుబాటు ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం కోసం, ప్రైవేటు లే అవుట్లలోని  5 శాతం స్ధలాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు నవరత్నాల అమలుకు కేలెండర్‌ రూపకల్పన, వసతి దీవెన, రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణ తదితర అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1 లక్షా 43 వేల 600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్ల ను ప్రభుత్వం అప్పగించనుంది. 365, 430 చదరపు అడుగులకు సంబంధించి వారు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బుసబ్సిడీ రూపంలో  అందనుంది.  టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరుపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది

 
 

Related Stories