సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో మార్చి నెల కోటాకు సంబంధించి రేషన్ పంపిణీ ఈనెల నేటి శనివారం నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో గత ఫిబ్రవరి రేషన్ తీసుకోని కార్డుదారులకు రెండు నెలల రేషన్ కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 9 మున్సిపల్ పట్టణాల్లో 126 మొబైల్ వాహనాల ద్వారాను, గ్రామీణ ప్రాంతాల్లో 658 మొబైల్ వాహనాల ద్వారా ఫిబ్రవరిలో రేషన్ కార్డుదారులకు ఇంటింటికీ పంపిణీ చేశారు. మార్చికి సంబంధించి అర్బన్ ఏరియాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఇంటింటికీ పంపిణీ ప్రారంభించినా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 6వ తేదీ నేటి, శనివారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరిలో సరుకులు తీసుకోని కార్డుదారులకు మార్చిలో పట్టణాల్లో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు మార్చి కోటాతో కలిపి రెండు నెలల సరుకులు పొందవచ్చునని తెలిపారు.
|