తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

భీమవరంకు పొంచి ఉన్న యనమదుర్రు వరద ముప్పు..

Updated: October 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు భీమవరం పట్టణం శివారు ప్రాంతాలు తో పాటు పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తున్న యనమదురు కాలువ సరిహద్దు ప్రాంతాలు, గ్రామాలు  అన్ని గత 6 రోజులుగా జలమయం అవుతున్నాయి.నేటి సోమవారం నాటికీ యనమదురు కాలువ అన్ని హద్దులు చెరిపేస్తాను అన్నట్లు మరింత  ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎక్కడ గండి పడకుండా అధికారులు , స్థానికులు పలు చోట్ల ఇసుక బస్తాలు తదితర ముందు జాగ్రత్తలతో  వరద నీరు పట్టణంలోకి రాకుండా అడ్డుకొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే లోపలి వచ్చిన వరద నీరును భారీ మోటార్స్ సాయంతో తోడి మరల కాలువలోకి వదులుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. స్థానిక ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస వరద ఉదృతి ఉన్న ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. మరల అల్పపీడన ప్రభావం తో నేటి సాయంత్రం నుండి ఆకాశం కరుమబ్బులతో భయపెడుతుంది. రేపు భారీ వర్షాలు తప్పవు. రేపటి వరకు యనమదురు వరద ఉదృతి తట్టుకొంటే, సమీపంలోని సముద్రం కూడా నీరు బాగా లాక్కుంటే గండం గట్టెక్కినట్లే అని భావించాలి.. 

 
 

Related Stories