తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

మహారాష్ట్ర లో 45 వేలకు చేరువుగా కరోనా కేసులు..భయానకం

Updated: May 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  భారత దేశంలో ఒక్క మహారాష్ట్ర తప్ప మిగతా రాష్ట్రాలలో అంతో ఇంతో  కరోనా వైరస్‌ అదుపులోనే  ఉంది. అయితే మహారాష్ట్ర లో  ప్రాణాంతక వైరస్‌ ధాటికి మరీముఖ్యంగా  దేశ ఆర్థిక రాజధాని ముంబైవాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నేడు, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2940 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యియి. రాష్ట్రంలో వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 44,582 కి చేరిందిఇక  ఆసియాలోనే అత్యంత మురికివాడల్లో  ఒకటైన ధారావిలో కరోనా భయాందోళన సృష్టిస్తోంది. ఈ ఒక్క  మురికివాడలో మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1460కి పెరిగింది. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు భావిస్తున్నారు. ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. 
 

 

 
 

Related Stories